ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘కోడ్‌’ను పట్టించుకోరా?

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:39 PM

ఎన్నికల కోడ్‌ వచ్చి తొమ్మిది రోజులు గడిచినా జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

- పూర్తిస్థాయిలో అమలు కాని వైనం

- ఎక్కడికక్కడే సీఎం బొమ్మలు

గజపతినగరం/శృంగవరపుకోట రూరల్‌, మార్చి 24: ఎన్నికల కోడ్‌ వచ్చి తొమ్మిది రోజులు గడిచినా జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ రాజకీయ నాయకుల ఫొటోలు, పోస్టర్లు, హోర్డింగులు ఎక్కడా ఉండకూడదని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల సీఎం జగన్‌ ఫొటోలు, బ్యానర్లు, వైసీపీ జెండాలను ఇంకా తొలగించలేదు. ్ఠగజపతినగరం మండలంలోని మదుపాడ రైతు భరోసా కేంద్రంపై ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉన్నా అధికారులు పట్టించుకోవ డంలేదు. అలాగే అంగన్వాడీల కేంద్రాల నుంచి లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహారం ప్యాకెట్లపై కూడా జగన్‌ బొమ్మ ఉంది. వాటినే అంగన్వాడీలు పంపిణీ చేస్తున్నారు. శృంగవరపుకోట మండలంలోని కాపుసోంపురం గ్రామంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చిత్రపటం ఉంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా ఇంకా తమ పంచాయతీలోని ప్రభుత్వ సిబ్బందికి పట్టనట్లు ఉందని పలువురు యువకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వాటిని తొలగించాలని కోరుతున్నారు.

బొబ్బిలి ఎమ్మెల్యేపై కేసు నమోదు

బొబ్బిలి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడుతో పాటు కొంతమంది వైసీపీ నేతలపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.లోవరాజు తెలిపారు. ఎటువంటి అనుమతి తీసుకోకుండా బొబ్బిలి మండలం చిత్రకోటబొడ్డవలస పంచాయతీలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే శంబంగి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిపై ఎంపీడీవో రవికుమార్‌.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో ఎ.సాయిశ్రీకి ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు ఎమ్మెల్యేతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఖాసాపేట గ్రామ వలంటీరు తొలగింపు

కలెక్టరేట్‌: రాజకీయ నాయకులకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఎల్‌.కోట మండలానికి చెందిన వలంటీరును విధుల నుంచి తొలగించినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్‌.కోట మండలం ఖాసాపేట గ్రామ సచివాలయ పరిధిలోని వలంటీరు బొబ్బిలి శివ ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. నిజమని తేలడంతో వలంటీరును విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Mar 24 , 2024 | 11:39 PM

Advertising
Advertising