మీ పద్ధతి మార్చుకోరా.. నేనే మారుతా
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:22 AM
‘మీ పద్ధతి మార్చుకోరా.. సరే నేనే మారుతా’ అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. శాశ్వత, ఔట్‌సో ర్సింగ్ పారిశుధ్య కార్మికులు, వారి పనులను పర్య వేక్షించే సచివాలయ ఉద్యోగులకు హెచ్చరించారు.
పార్వతీపురంటౌన్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘మీ పద్ధతి మార్చుకోరా.. సరే నేనే మారుతా’ అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.. శాశ్వత, ఔట్‌సో ర్సింగ్ పారిశుధ్య కార్మికులు, వారి పనులను పర్య వేక్షించే సచివాలయ ఉద్యోగులకు హెచ్చరించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పట్టణంలోని 30 వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న శాశ్వత, ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్రతి వార్డులో పారిశుధ్య నిర్వహణపై అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ఫిర్యాదు ల ప్రకారం ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఇక నుంచి 30 వార్డుల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపుగా పారిశుధ్య నిర్వహణ పనులకు సంబంధించి అప్‌లోడ్ ప్రక్రియను చేపట్టాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పకీరురాజుకు సూచించారు. మున్సిపల్ అఽధికారులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగ కల్పనే లక్ష్యం
పార్వతీపురంటౌన్, అక్టోబరు 21(ఆంధ్ర జ్యోతి): ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిరుద్యో గ యువతీ, యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని కొత్తవలస శ్రీవేంకటే శ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ మెగా జాబ్ మేళాలో 18 కంపెనీల్లో ఉపాధి పొందేందుకు 578 హాజరు కాగా ఆయా కంపెనీల్లో 85 మందిని ఎంపిక చేశామని చెప్పారు. అనంతరం నియామక పత్రాలు పంపిణీ చేశారు. డీఎస్‌డీవో కె.సాయికృష్ణ చైతన్య, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ చలపతిరావు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సీతానగరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గెడ్డెలుప్పి ఆర్‌అండ్‌బీ కూడలి నుంచి కొత్తవలస రోడ్డు వరకు బీటీ రోడ్డుకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు పెంట సత్యంనాయుడు, రౌతు గోపాల్‌నాయుడు, గొట్టాపు వెంకటనాయుడు, ఎంపీడీవో త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:22 AM