ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చినుకు.. రైతుల్లో వణుకు

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:15 AM

జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉన్నా.. చివరిదశలో తుఫాన్‌ కారణంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. మూడు, నాలుగు రోజులు తెరిపి ఇచ్చిఉంటే పంటను సురక్షితంగా ఇళ్లకు చేర్చుకునేవాళ్లమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకొండ: నూర్పులు పూర్తి చేసుకొని కల్లాల్లోనే ఉన్న ధాన్యం

ఇంకా పొలాల్లానే వరి పైరు

తడిచిపోతే నష్టం తప్పదని భయం

జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉన్నా.. చివరిదశలో తుఫాన్‌ కారణంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. మూడు, నాలుగు రోజులు తెరిపి ఇచ్చిఉంటే పంటను సురక్షితంగా ఇళ్లకు చేర్చుకునేవాళ్లమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అక్కడక్కడా కురిసిన జల్లుల కారణంగా వరిపనలు తడిచిపోయాయి. కొంతమంది రైతులు వరి కోసినా.. కూలీల కొరతతో కుప్పలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం తడిచి రంగుమారుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

పార్వతీపురం/పాలకొండ/భామిని/వీరఘట్టం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): తుపాన్‌ ప్రభావం మన్యం జిల్లా అంతటా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఖరీఫ్‌ పంట పంట పొలాల్లోనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. పొలాల్లోను, కల్లాల్లోను ఉన్న పంటను దక్కించుకొనేందుకు రైతాంగం పరుగులు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 శాతానికి పైగా వరి పంట కోత పూర్తయింది. మరికొంతమంది యంత్రాలతో కోసి కుప్పలు వేస్తున్నారు. పనాలను కుప్పలు వేస్తున్నారు. ఇప్పటికే పంట నూర్పుడి పూర్తి చేసుకున్న రైతులు ధాన్యాన్ని భద్రపరిచేందుకు అగచాట్లు పడుతున్నారు. మరికొంతమంది రైతులు వరి కుప్పల పైన టార్పాన్లు కప్పారు. చిరుజల్లులైతే పర్వాలేదుగానీ.. భారీ వర్షం కురిస్తే రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ కింద వరి పంటను సాగవుతోంది. కొంతమంది రైతులు కోసిన వరిచేను కూలీల కొరతతో కుప్పలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో వర్షం కురిస్తే పనాలు తడిసి నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. పత్తిపంట కోసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కూలీల కొరతతో పత్తిని ఏరలేదు. వర్షాలు పడితే పత్తిపంట నష్టం వస్తుందని రైతులు దిగాలు చెందుతున్నారు.

సీతంపేట రూరల్‌/సాలూరు రూరల్‌: తుఫాన్‌ ప్రభావంతో సీతంపేట, సాలూరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గాలులు వీస్తుండడంతో మన్యం వాసులు చలికి వణికిపోతున్నారు. తుఫాన్‌పై ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో వరి కోతలను గిరిజన రైతులు కొద్ది రోజులు పాటు వాయిదా వేసుకున్నారు. అక్కడక్కడ కోతలు జరిగిన చోట చేనును కుప్పలుగా వేసి టార్పాలిన్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం కురిస్తే పంటను నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Nov 30 , 2024 | 12:15 AM