సాగునీటి కోసం రైతుల ధర్నా
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:21 AM
సాగు నీటి కోసం మండల రైతులు రోడ్డెక్కారు.
పాలకొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సాగు నీటి కోసం మండల రైతులు రోడ్డెక్కారు. మండలంలోని వెలగవాడ, పీఆర్‌రా జుపేట, పాలకొండ, ఓని తదితర గ్రామాలకు చెందిన రైతులు సోమ వారం ప్లకార్డులతో ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియ జేశారు. తక్షణమే సాగునీరు అందించాలని, లేనిపక్షంలో చివరి దశ లో ఉన్న పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో నీటిపారుదల శాఖ ఏఈ శంకరరావుతో వాగ్వివాదానికి దిగారు. లస్కర్లు కొరత, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో సాగునీరు లేని పరిస్థితి కారణంగా అందించలేకపోయామని ఏఈ రైతులకు బదులి చ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను సముదాయింపు చేశారు. అనంతరం ఇరిగేషన్ ఏఈకి వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ఆయకట్టు రైతు లు ఖండాపు ప్రసాదరావు, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:21 AM