ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెరపైకి ఫీడర్‌ అంబులెన్స్‌లు

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:45 PM

వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చెందిన 18 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసింది. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అందించిన ఫీడర్‌ అంబులెన్స్‌లను నిర్వీర్యం చేసింది.

తెరపైకి ఫీడర్‌ అంబులెన్స్‌లు

అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల ప్రస్తావన

గిరి శిఖర గ్రామాల కష్టాలు ఏకరువు

కూటమి ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని గిరిజనుల్లో నమ్మకం

గతంలో టీడీపీయే శ్రీకారం

నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం

- వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చెందిన 18 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసింది. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అందించిన ఫీడర్‌ అంబులెన్స్‌లను నిర్వీర్యం చేసింది. దీంతో మళ్లీ కొండ శిఖర గ్రామాల గిరిజనులు కష్టాలు పడ్డారు. రహదారులు లేక డోలీలు కట్టి గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఇప్పటికీ రాళ్లు, పొదలను దాటుతూ కిందకు దించుతున్నారు. గత ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకుండా గిరిజనులకు అన్యాయం చేసింది. కూటమి ప్రభుత్వం మళ్లీ ఫీడర్‌ అంబులెన్స్‌లను ప్రవేశపెడితే గిరిజనులకు చాలా మేలు చేకూరుతుంది.

- శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి విన్నపం

- గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో ఫీడర్‌ అంబులెన్స్‌లు కీలకపాత్ర పోషించాయి. గత వైసీపీ ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. వెంటనే వీటిని పునరుద్ధరించాలి.

- అసెంబ్లీలో ప్రస్తావించిన విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు

డోలీ ప్రయాణం.. ఎంత కష్టమో... రహదారి లేక గిరి శిఖర వాసులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నారో.. సకాలంలో ఆస్పత్రికి చేరలేక ప్రాణాలు సైతం కోల్పోయిన వారెందరో... తదితర అంశాలపై శాసన సభ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వివరించారు. ఫీడర్‌ అంబులెన్స్‌ల అవసరాన్ని నొక్కి చెప్పారు. గతంలో టీడీపీయే ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో తెలియజేశారు. తాజా పరిణామాలతో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం తప్పకుండా తిరిగి ఫీడర్‌ అంబులెన్స్‌లు ప్రవేశపెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు.

శృంగవరపుకోట, నవంబరు 18(ఆంధ్రజ్యోతి):

జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కొత్తగా ఏర్పడిన తరువాత కూడా విభజిత విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాలున్నాయి. శృంగవరపుకోట, గంట్యాడ, వేపాడ, కొత్తవలస, మెంటాడ తదితర మండలాల్లో గిరిజనులు నివశిస్తున్నారు. శృంగవరపుకోట మండలం దారపర్తి గిరిజన పంచాయతీ పరిధిలో దాదాపు పది శివారు గ్రామాలున్నాయి. ఈ గ్రామాలకు రహదారి లేదు. గిరి శిఖరాన ఉండడంతో కనీసం ద్విచక్రవాహనం వెళ్లే అవకాశం లేదు. దీంతో గర్భిణులు, చిన్నపిల్లలు, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లేందుకు డోలీలు తప్పనిసరి. ఇలా తరలించే సమయంలో వైద్యం ఆలస్యం కావడంతో పలువురు మృతి చెందారు. ఎనిమిది నెలల క్రితం చిన్న పిల్లాడు, ఓ మహిళ రోజుల వ్యవధిలో చిట్టింపాడులో ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎం.శ్రీభరత్‌ కలసి కొండెక్కారు. ఆ గ్రామాన్ని చూశారు. మిగిలిన గ్రామాల దుస్థితిని చూసి చలించిపోయారు. అప్పుడే ఈ గ్రామాలకు రోడ్డు వేయిస్తామని మాటిచ్చారు. అనుకున్న ప్రకారం అధికారంలోకి రాగానే రోడ్డుకు రూ.11.50 కోట్లు మంజూరు చేయించారు. గంట్యాడ మండలం డీకేపర్తి పరిస్థితి ఇంతే. మెంటాడ మండలంలోనూ ఇలాంటి గ్రామాలున్నాయి. ఆయా గ్రామాలకు చేరుకోవడానికి రోడ్డు ఉంటే ఫీడర్‌ అంబులెన్స్‌లు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. శుక్రవారం కొచ్చన్‌ అవర్‌లో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అడిగిన ప్రశ్నకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందిస్తూ ప్రస్తుతం వున్న ఫీడర్‌ అంబులెన్స్‌లతో పాటు కొత్తగా 47 ఫీడర్‌ అంబులెన్స్‌లు కేటాయించామని, 315 కిలోమీటర్లు పరిధిలో రోడ్ల నిర్మాణాలకు రూ.280 కోట్లు పరిపాలన అనుమతులు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి వైపుగా అడుగులు వేసింది. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు కూడా అసెంబ్లీలో గిరిజనుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధానంగా ఫీడర్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. కూటమి ప్రభుత్వం తప్పకుండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- పదేళ్లుగా కొత్తవలస మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలన్న డిమాండ్‌ ఉంది. ఈ మండలానికి ఆనుకుని వున్న వేపాడ, ఎల్‌.కోట, జామి మండలాలకు చెందిన వారితో పాటు అనకాపల్లి జిల్లా మాడుగల నియోజకవర్గంలోని కె.కోటపాడు, దేవరాపల్లి, మండలాలకు చెందిన విద్యార్థులకు ఉపయోగకరంగా వుంటుంది. 2014-2019లో అధికారంలో వున్న తెలుగు దేశం ప్రభుత్వం ఈ కళాశాల ఏర్పాటుకు సిద్ధపడుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. అధికారం చేపట్టిన వైసీపీ దీని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శాసన సభలో ప్రస్తావన తేవడంతో కళాశాల ఏర్పాటు తథ్యమని స్థానికులు నమ్మకంగా ఉన్నారు.

---------------

Updated Date - Nov 18 , 2024 | 11:45 PM