ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:12 PM

జిల్లాకేంద్రంలోని గిరిజన సామాజిక భవనంలో సోమవారం గిరి ప్రతిభ-ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఈ సెంటర్‌ కొన సాగనుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని గిరిజన సామాజిక భవనంలో సోమవారం గిరి ప్రతిభ-ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఈ సెంటర్‌ కొన సాగనుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తంగా 16,500 పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ అవ్వగా.. కోచింగ్‌కు సుముఖంగా ఉన్న అభ్యర్థులంతా ఇందులో చేరొచ్చన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కోచింగ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పెషల్‌ డీఎస్సీ వద్దని అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు అనడం సమంజసం కాదన్నారు. 2016లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు జీతాలు పెంచారని , గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ టీచర్లను పట్టించుకోలేదని గర్తు చేశారు. డీఎస్సీలో 2 వేల పోస్టులు గిరిజనులకు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో కురుపాం, పాలకొండ నియోజకవర్గాలతో నాలుగు బెడ్స్‌తో కంటైనర్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... విద్యార్థుల కోసం గ్రంథాలయం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీతంపేట ఐటీడీఏతో పాటు అవసరమైతే గుమ్మలక్ష్మీపురం వంటి చోట్ల కూడా ఉచిత డీఎస్సీ కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎయిర్‌ఫోర్సు ఉద్యోగావకాశాలపై ఈ నెల 6, 7 తేదీల్లో సీతంపేట, పార్వతీపురంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గిరి ప్రతిభ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఉచిత డీఎస్సీ కోచింగ్‌కు 230 దరఖాస్తులు అందాయని, వారికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా వంద మంది ఎంపికయ్యారని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ తెలిపారు. గిరిజన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌, స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నామని, మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఇన్‌చార్జి డీఈవో ఎన్‌.తిరుపతినాయుడు, ఐటీడీఏ ఏపీవో ఏ.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:12 PM