ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనాలు ఇవ్వండి

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:06 AM

ల్లాలో పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనకు ప్రతిపాదనలు ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని కలెకర్‌ అంబేడ్కర్‌ చెప్పారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి

ప్రతిపాదనాలు ఇవ్వండి

రామతీర్థం, చింతపల్లి, తాటిపూడిలో

వసతుల కల్పనకు ప్రాధాన్యం: కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో వసతుల కల్పనకు ప్రతిపాదనలు ఇస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని కలెకర్‌ అంబేడ్కర్‌ చెప్పారు. రామతీర్థం తీర్థ యాత్ర పర్యాటక ప్రాంతంగా, చింతపల్లిలో బీచ్‌ టూరిజిం ప్రాంతంగా, తాటిపూడి రిజర్వాయర్‌ను విహారయాత్ర ప్రదేశంగా పరిగణించి ఆయా ప్రాంతాల్లో వసతులు కల్పనకు ప్రతిపాదనలు చేయాలన్నారు. అదేవిధంగా విజయనగరానికి సమీపంలో ఉన్న రామానారాయణం వద్ద ఉన్న కోనేరును అభివృద్ధి చేసేందుకు కూడా ప్రతి పాదనలు రూపొందించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు అందజేయనున్నట్లు చెప్పారు. సీపీవో, పర్యాటక అధికారులతో మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ సమీక్షించారు. చింతపల్లి బీచ్‌ వద్ద సముద్ర తీర పర్యాటకం అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం కాటేజీల నిర్మాణం, రెస్టారెంట్‌, చిల్ట్రన్‌ పార్కు తదితర వాటిపై దృష్టిసారించామన్నారు. తాటిపూడిలో పర్యాటకుల కోసం బోట్లను నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చినందున కాటేజీల వరకూ రోప్‌ బ్రిడ్జి నిర్మాణం, అక్కడున్న పది ఎకరాల్లో కేఫ్‌ టేరియా, బర్డ్‌ పార్కు, కన్వెన్షన్‌ హాల్‌, థియేటర్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

- నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో దృష్టిలోపాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయని అందువల్ల అటువంటి వారికి కంటి పరీక్షలు చేయించడంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ సూచించారు. ప్రపంచ ప్రిమెచ్యూర్‌డే నడకను మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ఆయన ప్రారంభించారు.

- రానున్నరోజుల్లో జిల్లాలో అనారోగ్యంతో ఏ ఒక్క శిశువు జన్మించకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. కిశోర్‌ వికాసం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన శిక్షకులను ఉద్దేశించి కలెక్టరు మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మాట్లాడారు.

- మరుగుదొడ్డి అనేది ఆత్మ గౌరవానికి చిహ్నమని, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పసరిగా ఉండాలని, లేని వారికి వెంటనే మంజూరు చేస్తామని కలెక్టరు అంబేడ్కర్‌ తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Updated Date - Nov 20 , 2024 | 12:06 AM