ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనందరి దేవుడు..

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:29 AM

‘మనందరి దేవుడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

సాలూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘మనందరి దేవుడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఐదో వార్డు(రెల్లివీధి)లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారానే దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. 4, 5 వార్డు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:29 AM