ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉరితాడు తగిలించుకుని..

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:11 AM

గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు మెడకు ఉరితాడు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ ఎదుట వారు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది.

మెడకు ఉరితాడు తగిలించుకుని నిరసన తెలుపుతున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు

పార్వతీపురం/బెలగాం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు మెడకు ఉరితాడు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఐటీడీఏ ఎదుట వారు చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. శనివారం వారు మాట్లాడుతూ.. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఆర్టీలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నుంచి తాము పని చేస్తున్న పోస్టులను మినహాయించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి , రంజిత్‌కుమార్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజు మద్దతు తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:11 AM