ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హర హర మహాదేవ

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:47 PM

కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణ మార్మోగింది. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా శైవ క్షేత్రాలు, గుహాలయాలకు చేరుకున్నారు.

పారమ్మకొండ గుహలో పూజలందుకున్న శివయ్య

భక్తిశ్రద్ధలతో కార్తీక మూడో సోమవారం పూజలు

పార్వతీపురం, నవంబరు18 (ఆంధ్రజ్యోతి)

కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణ మార్మోగింది. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా శైవ క్షేత్రాలు, గుహాలయాలకు చేరుకున్నారు. గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించుకుని పులకించిపోయారు. విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో రుద్రాభిషేకాలతో పాటు సాలిగ్రామ దానాలు చేశారు. మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టారు. సాయంత్రం ఆలయాలకు చేరుకుని దీపారాధనలు చేశారు. ఇళ్లలోనూ నోములు, వ్రతాలు నిర్వహించారు. మొత్తంగా జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Updated Date - Nov 18 , 2024 | 11:47 PM