ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవగాహన లేక.. వినియోగానికి నోచుకోక

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:10 AM

మండలంలోని పలు గ్రా మాల్లో శతశాతం ఆరుబయట బహిరంగ మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యం అటకెక్కుతోంది. ప్రధానంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహ న లేకపోవడంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో కొందరు సామగ్రి నిల్వచేసు కోవడానికి వినియోగిస్తున్నారు.

బంగారమ్మపేటలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు :

గజపతినగరం, నవంబరు 23 ( ఆంధ్రజ్యోతి):మండలంలోని పలు గ్రా మాల్లో శతశాతం ఆరుబయట బహిరంగ మలవిసర్జన నిర్మూలించాలన్న లక్ష్యం అటకెక్కుతోంది. ప్రధానంగా మరుగుదొడ్ల వినియోగంపై అవగాహ న లేకపోవడంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో కొందరు సామగ్రి నిల్వచేసు కోవడానికి వినియోగిస్తున్నారు. 30పంచాయతీల్లో 60 వేలకుపైగా జనాభా నివసిస్తోంది.గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఉంచేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. గతంలో టీడీపీహయాంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకోవాలని భావిం చి రూ.15 వేలతో మరుగుదొడ్లు నిర్మాణాలను ప్రయోగాత్మకంగా చేపట్టిం ది.మరుగుదొడ్డి లేనివారికి పింఛన్‌, రేషన్‌కార్డు నిలిపివేస్తామని హెచ్చరిం చడంతో ప్రతిఒక్కర్లూమరుగుదొడ్లను నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో మరుగుదొడ్ల వినియోగం అటకెక్కింది. కాగాప్రతిఒక్కరూ మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఎంపీ డీవో బి.కళ్యాణి కోరారు. ప్రస్తుతం ఇంటింటిసర్వే చేపడుతున్నామని, లేని వారినిగుర్తించి సొంతస్థలం ఉంటే మరుగుదొడ్డి నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:10 AM