ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలిసిరాని పత్తి

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:48 PM

పత్తి రైతులు దళారుల వ్యూహానికి చిక్కి గిట్టుబాటు ధరకు నోచుకోవడం లేదు. రామభద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఏటా పత్తిపంట సాగుచేస్తున్న రైతులకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రైతులు పంటను అప్పగించే పరిస్థితి లేదు.

: పత్తి కొనుగోలు కేంద్రం

కలిసిరాని పత్తి

క్వింటా రూ.6450కే అమ్మకం

కొనుగోలు కేంద్రాల్లో ధర రూ.7520

దళారులదే రాజ్యం

కొనుగోలు కేంద్రాలు ఉన్నా రైతుకు ఉపయోగం లేని వైనం

రామభద్రపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు దళారుల వ్యూహానికి చిక్కి గిట్టుబాటు ధరకు నోచుకోవడం లేదు. రామభద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఏటా పత్తిపంట సాగుచేస్తున్న రైతులకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రైతులు పంటను అప్పగించే పరిస్థితి లేదు. చెల్లింపులు ఆలస్యం అవుతాయన్న భయం.. పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక పత్తిని వ్యాపారులకే విక్రయించి సరైన గిట్టుబాటు ధర పొందలేకపోతున్నారు.

రామభద్రపురం, బాడంగి, సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ, తెర్లాం, దత్తిరాజేరు తదితర ప్రాంతాల్లో ఈ సీజన్‌లో ఏటా సుమారు లక్షా 50 వేల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరుగుతాయి. కొనుగోలు కేంద్రాలకు ప్రత్తి విక్రయించడం వల్ల పేమెంట్లు ఆలస్యం అవుతాయని రైతులు భావిస్తున్నారు. దళారులు ఇదే విషయాన్ని వారికి నూరిపోస్తుంటారు. అదే సమయంలో పంటను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే సామర్థ్యం రైతులకు లేదు. వర్షాలు వస్తే ఉన్న పంట అంతా పోతుందన్న భయంతో వచ్చిన ధరకు పంటను అప్పగిస్తున్నారు. ఈ ఏడాది పత్తిరేటు మార్కెట్‌లో అధికంగా ఉండడంతో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారే తప్పా రైతులు మాత్రం చాలీచాలని డబ్బులతోనే సరిపెట్టుకుంటు న్నారు. క్వింటా పత్తి మార్కెట్‌ రేటు రూ.6450 ఉంది. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన ప్రత్తిని రూ.7520లకు కొనుగోలు చేస్తున్నారు. అయితే పంటలో ఆ స్థాయి నాణ్యతను అధికారులు నిర్ధారించడం లేదు. నాణ్యత బాగాలేదంటూ తక్కువ ధర ఇస్తున్నారనేది రైతుల భావన. అందుకనే పంట పొలం వద్దకు వచ్చే వ్యాపారులకే పంటను అప్పగిస్తున్నారు. వ్యాపారులు రైతులకు క్వింటా వద్ద రూ.6450

Updated Date - Nov 17 , 2024 | 11:48 PM