పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో విచారణ
ABN, Publish Date - Sep 27 , 2024 | 12:35 AM
స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు గురువారం విచారణ జరిపారు.
బొబ్బిలి: స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు గురువారం విచారణ జరిపారు. ఈ పాఠశాలలో అవాంఛనీయ ఘట నలు చోటుచేసుకుంటున్నాయని పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం డీ ఎస్పీ శ్రీనివాసరావు, సీఐ సతీష్‌కుమార్‌లు పాఠశాలకు వెళ్లి హెచ్చరికలతో కూడిన అ వగాహన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. డిప్యూటీ డీఈవోను పాఠశాలకు పంపించి సమగ్ర విచారణ జరి పించాలని ఆదేశించారు. దీంతో గురువారం డిప్యూటీ డీఈవో మోహనరావు, ఇద్దరు ఎంఈవోలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపు వాసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలలో ఎటువంటి అవాంఛనీయ, అనైతిక కార్యకలాపాలు జరిగినట్లు ఫిర్యా దులు వచ్చినా చట్టపరంగా కఠినచర్యలు తప్పవని, బాధ్యులైన వారిని పూర్తిగా డిస్మి స్ చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి విడివిడిగా స్టేట్‌మెంట్లు నమో దు చేశారు. హైస్కూల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని వారంతా లిఖిత పూర్వకంగా అధికారులకు తెలియజేశారు. పోక్సో చట్టం అమల్లో ఉన్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని, నైతిక విలువలను పరిరక్షించాలని, పాఠశాల ఔన్నత్యాన్ని కాపాడాలని డిప్యూటీ డీఈవో సూచించారు.
డీఈవోకు నివేదిక ఇస్తాం
పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో ఎవరి నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పాఠశాలలో ఏమి జరిగిందన్న దానిపై ఆరా తీశాం. పాఠశాలలో ఏమీ జరగలేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు విడివిడిగా రాసిచ్చారు. డీఈవో ఆదేశాల మేరకు పాఠశాలలో పనిచేస్తున్న వారందరికీ చట్టనిబంధనలు, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను కూలంకుషంగా వివరించాం. పాఠశాలలో ప్రస్తుత తాజా పరిస్థితిపై జరిపిన విచారణాంశాలను సమగ్రంగా డీఈవోకు నివేదిక అందజేస్తాం.
- కె.మోహనరావు, డిప్యూటీ డీఈవో
Updated Date - Sep 27 , 2024 | 12:35 AM