వల్లూరు క్షేత్ర సహాయకురాలిపై విచారణ
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:32 AM
మండలంలోని వల్లూరు గ్రామ ఉపాధి హామీ పఽథకం క్షేత్ర సహాయకురాలు చంద్రకళపై స్థానికులు ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు గ్రామంలో బుధవారం బహిరంగ విచారణ చేపట్టారు.
నెల్లిమర్ల: మండలంలోని వల్లూరు గ్రామ ఉపాధి హామీ పఽథకం క్షేత్ర సహాయకురాలు చంద్రకళపై స్థానికులు ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు గ్రామంలో బుధవారం బహిరంగ విచారణ చేపట్టారు. ఏపీడీ శారద ఫిర్యాదుదారులతో పాటు వేతనదారుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గ్రామ పెద్దలు, మేట్‌ల నుంచి కూడా వివరాలను సేకరించారు. జిలా ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు నివేదిక అందిస్తానని... దీని ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఏపీడీ శారద తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, టీడీపీ సీనియర్ నాయకుడు సువ్వాడ రవిశేఖర్, సర్పంచ్ పంచాది జయలక్ష్మి, ఎంపీటీసీ లెంక నాగేశ్వరి, ఏపీడీ అరుణ కుమారి, ఈసీ కార్తీక్, వేతనదారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:32 AM