ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులందరికీ జాబ్‌కార్డులు అందించాలి

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:09 AM

అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు అందించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

పాలకొండ: అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు అందించాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం స్థానిక మండల పరి షత్‌ కార్యాలయంలో ఎంపీపీ బొమ్మాళి భాను ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. రెండేళ్లుగా నూతన జాబ్‌కార్డులు జారీ చేయకపోవడం తో అర్హులు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తంపటాపల్లి సర్పంచ్‌ జాడ శ్రీధర్‌, తుమరాడ ఉప సర్పంచ్‌ పొట్నూరు శోభారాణి సభ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో అర్హులైన వారందరికీ జాబ్‌కార్డులు అందించా లని ఎమ్మెల్యే ఆదేశించారు. అంగన్‌వాడీలకు నూతన భవనాల నిర్మాణానికి, మరమ్మతులకు చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానన్నారు. తోటపల్లి కాలువల ద్వారా శివారు ప్రాంతాలకు నీరందడం లేదని తంపటాపల్లి ఉప సర్పంచ్‌ జాడ శ్రీధర్‌, లుంబూరు మాజీ సర్పంచ్‌ రౌతు సోంబాబు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జేఈ శంకరరా వు స్పందిస్తూ లస్కర్లు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ప్రస్తావించే సమయంలో వైస్‌ ఎంపీపీ కనపాక సూర్య ప్రకాష్‌ సమాధానం చెప్పడంపై ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీపీ సారఽథ్యంలో మండల సర్వసభ్య సమావేశం జరగాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఎంపీడీఓ ఉమామహేశ్వరి, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2024 | 12:09 AM

Advertising
Advertising
<