ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జూట్‌మిల్లు సమస్యలను పరిష్కరించాలి

ABN, Publish Date - Aug 05 , 2024 | 11:58 PM

నెల్లిమర్ల జూట్‌మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాల ని మిల్లు ఇఫ్టూ కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కోరారు.

నెల్లిమర్ల: నెల్లిమర్ల జూట్‌మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాల ని మిల్లు ఇఫ్టూ కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కోరారు. ఈమేరకు ఇఫ్టూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గీత, జిల్లా ఉపాధ్యక్షుడు కాళ్ల అప్పలసూరి తదితరులు సోమవారం నెల్లిమర్లలోని ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి, ఆమెకు వినతిపత్రం అందజేశారు. మిల్లు యాజమాన్యం తరుచూ కుంటి సాకులు చెబుతూ మిల్లును మూసివేస్తున్నదని చెప్పారు. కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిలను చెల్లించడం లేదని, పీఎఫ్‌ ఖాతాకు తమ సొమ్ము జమచేయలేదని వారు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి, మిల్లు కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని ఇఫ్టూ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నామాల తిరుపతిరావు, తివనాని అప్పారావు, పడాల జయమ్మ ఉన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:58 PM

Advertising
Advertising
<