బడిదేవర కొండపై మైనింగ్ చట్ట విరుద్ధం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:14 AM
బడిదే వర కొండపై మైనింగ్ అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి ఆరోపించారు.
బెలగాం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): బడిదే వర కొండపై మైనింగ్ అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి ఆరోపించారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో బండిదేవర కొండపై తవ్వకాలు నిలిపివేయాలని రౌండ్‌టేబుల్ సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణమూ ర్తి మాట్లాడుతూ బడిదేవర కొండపై మైనింగ్ కోసం అనుమతులు ఇవ్వడం వల్ల పర్యావరణా నికి విఘాతం కలుగుతుందని తెలిపారు. గతం లో ఆ కొండ రిజర్వ్‌ఫారెస్ట్‌లో ఉందని చెప్పి అక్కడ గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు అదే కొండ రెవెన్యూ పరిధిలో ఉందని పట్టాలు రద్దుచేశారని ఆరోపించారు.ఎన్నో ఏళ్ల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరి జనులు జీవనోపాధికోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కొండపై తవ్వకాలు ఆపాలని, ఆపే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.సమావేశంలో ఆయా సంఘాల నాయకులు శ్రీను నాయుడు, పి.సంగం, పాకల సన్యాసి, రెడ్డివేణు, బంటు దాసు, రాము పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కృష్ణమూర్తి : బులగం 2
Updated Date - Oct 21 , 2024 | 12:14 AM