అర్హులకు త్వరలో కొత్త పింఛన్లు
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:18 AM
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో పింఛన్లు మంజూరవుతాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మెంటాడ: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో పింఛన్లు మంజూరవుతాయని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఒకటో తేదీ సెలవైతే ముందుగానే పింఛను అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో సెలవుల తరువాత తీరుబడిగా అందించే వారని గుర్తు చేశారు. ఆండ్ర, లోతుగెడ్డ గ్రామాల్లో మంగళవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపు అనేక హామీలను నెరవేర్చామని చెప్పారు. దశల వారీగా మిగిలినవి అమలు చేస్తామని సంధ్యారాణి తెలిపారు. కొందరు లబ్ధ్దిదారులకు మంత్రి స్వయంగా పింఛన్లు అందజేశారు. పోడు భూముల సాగుదారులకు త్వరలో పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తాను ఆండ్ర జలాశయంలో చేప పిల్లలు విడుదల చేయడం వల్ల ఎందరో నిర్వాసితులు లాభపడ్డారని, మళ్లీ చేపపిల్లలు విడిచిపెట్టి నిర్వాసితులను, గిరిజనులను ఆదుకుంటానని హమీ ఇచ్చారు. ప్రతి పేదవానికి మూడు సెంట్ల భూమి, ఇంటి నిర్మాణానికి రూ.నాలుగు లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీటీసీలు, సర్పంచులను పార్టీలకు అతీతంగా ఆహ్వానించాలని... లేదంటే ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చలుమూరి వెంకట్రావు, గెద్ద అన్నవరం, అప్పలనరసమ్మ, సూరెడ్డి కృష్ణమూర్తి, కొండ్రోతు శ్రీనివాసరావు, గంగులు, రెడ్డి ఆదినారాయణ, రెడ్డి ఎర్నాయుడు, ఎస్.గురునాయుడు, హరి ఈశ్వరరావు, ఎంపీడీఓ త్రివిక్రమరావు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యం
చీపురుపల్లి: అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లిలోని జి.అగ్రహారం, ఆకులపేటలో మంగళవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది పేదల ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నాటికే అర్హులందరికీ పింఛన్లు అందజేస్తోందన్నారు. గత ప్రభుత్వం పింఛనుదారులకు భరోసా కల్పించలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.రామకృష్ణరాజు, ఈఓపీఆర్డీ అన్నపూర్ణాదేవి, కూటమి నాయకులు గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, విసినిగిరి శ్రీనివాసరావు, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ప్రాధాన్యం
విజయనగరం రూరల్: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మంగళవారం పాల్గొన్నారు. దాసన్నపేట, నవాబుపేట, కేఎల్‌పురంలోని మొండివీధి, మండల పరిధిలోని పడాలపేట కార్యక్రమంలో అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని పెంచారన్నారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారన్నారు. కమిషనర్ నల్లనయ్య, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, బంగారుబాబు, గంటా రవి, నాగరాజు పాల్గొన్నారు.
గరివిడి (మెరకముడిదాం): మెరకముడిదాం మండలంలోని గొల్లలవలస, రాచపేట, పూతికవలస, యాడిక గ్రామాలలో మంగళవారం సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయుడు, టీడీపీ నాయకులు కోట్ల మోతీలాల్ నాయుడు, తాడ్డి చంద్రశేఖర్, కె.ధనుంజయ్, చల్లా శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 12:18 AM