విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన వద్దు
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:35 AM
ఉత్తరాంధ్రలో ఎంతో మందికి జీవనో పాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచ నను తక్షణమే విరమించాలని వైవీఎస్ మహాదేవన్ డిమాండ్ చేశారు.
విజయనగరం దాసన్నపేట, నవంబరు 15 (ఆంధ్ర జ్యోతి): ఉత్తరాంధ్రలో ఎంతో మందికి జీవనో పాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచ నను తక్షణమే విరమించాలని వైవీఎస్ మహాదేవన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్‌ఓ జిల్లా నాయకులు కె.సోమేష్, బి.రాజేష్‌ల అధ్యక్షతన ఎంఆర్ లేడీస్ క్లబ్‌లో ‘ఉత్తరాంధ్ర కరువు, వలసలు, విద్యా ఉపాధి రంగాలు-కర్తవ్యాలు’ అనే అంశంపై ఉత్తరాంధ్ర విద్యార్థుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా మహాదేవన్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన చందంగానే ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా సంపూర్ణంగా నేటికీ అమలు చేయలేదన్నారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర యువతకు అందుబాటులో లేవన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, జనసాహితీ సభ్యులు టి.మోహనరావు, పీడీఎస్‌ఓ ప్రతినిధులు భాస్కర్, పి.విశ్వనాథ్, కె.గౌతమి, రుద్రి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:35 AM