ప్రాథమిక రంగాలు వృద్ధి సాధించాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:08 AM
జిల్లాలో ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, అటవీ తదితర శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించి వృద్ధి సాధించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
- 2వేల ఎకరాలు నిమ్మగడ్డి పెంచాలి
- కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, అటవీ తదితర శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను అధిగమించి వృద్ధి సాధించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. గురువారం ప్రైమరీ సెక్టారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2 వేల ఎకరాల్లో నిమ్మగడ్డి పెంచేలా లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. ఉద్యానపంటల్లో జిల్లా దిగువ స్థాయి నుంచి పైస్థాయికి వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. గుంబూషియా చేపలు పెంచేందుకు ఆదర్శవంతమైన ఫార్మ్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో మొక్కలు పెంచే కార్యక్రమం ఉందని, అందుకు మొక్కలను సిద్ధం చేయాన్నారు. జిల్లాలో పాలు, మాంసం విక్రయాలు మరింత పెరగాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి ప్రసూన, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వసతిగృహాల్లో విద్యార్థులు సేవలు అందించాలి
జిల్లాలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాల్లో సేవలు అందించి, స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్షించారు. సాంకేతిక విద్య, పరి శ్రమల శిక్షణ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో సేవలు అందించడం వల్ల వారికి ప్రాజెక్టు వర్క్‌గా ఉపయోగడుతుందన్నారు. తద్వారా హాస్టళ్లలో వసతులు కూడా మెరుగుపడతాయని కలెక్టర్ అభిప్రాయప్డారు. ఇందుకు అవసరమైన సామగ్రిని అందిస్తామన్నారు. విద్యార్థులు వారికి దగ్గరలో ఉన్న వసతిగృహాలను సందర్శించి, వారు నేర్చుకున్న పనులు చేపడితే సరిపోతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మంజులవీణ, తదితరులు పాల్గొన్నారు.
22న ప్రతిభ పరీక్ష నిర్వహించాలి
మై స్కూల్, మై ప్రెడ్‌లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 22న ప్రతిభ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఎంఈవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతిభ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌కు పంపిస్తామన్నారు. ఏకకాలంలో ఈ పరీక్ష జరగాలని, అందులో అన్ని సబ్జెక్టులు ఉంటాయన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆంగ్ల భాషలో పది పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. అపార్ కార్డులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఇందుకు ఆధార్ కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:08 AM