ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెక్‌డ్యామ్‌లు నిర్మాణానికి ప్రతిపాదనలివ్వండి

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:49 PM

వాగులు గెడ్డలపై చెక్‌ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో వీటిని మంజూరు చేస్తామని చెప్పారు.

చెక్‌డ్యామ్‌లు నిర్మాణానికి

ప్రతిపాదనలివ్వండి

కలెక్టర్‌ అంబేడ్కర్‌

విజయనగరం కలెక్టరేట్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వాగులు గెడ్డలపై చెక్‌ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఇరిగేషన్‌ అధికారులను కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో వీటిని మంజూరు చేస్తామని చెప్పారు. ఈ పనుల నిర్వహణ కోసం సీనరేజీ మినహాయింపు కూడా ఇస్తామన్నారు. జలనరులశాఖ ద్వారా జిల్లా జరుగుతున్న పనులపై సోమవారం సాయంత్రం కలెక్టర్‌ సమీక్షించారు. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను అందజేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని ఈ ఏడాది వివిధ ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్వహణ పనులు, పూడిక తీత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆరు కోట్ల రూపాయలు మంజూరైనట్లు జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర, ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ సుగుణాకర్‌రావు తెలిపారు. జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన నిధుల వివరాలను తనకు తెలియజేస్తే ఉన్నతాధికారులతో సంప్రదించి ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు మంజూరు కోసం సిఫారుసు చేస్తామని కలెక్టరు చెప్పారు. సమావేశంలో డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, సీపీవో బాలాజీ, జలవనరులు శాఖ ఈఈలు రామచంద్రరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

----------

Updated Date - Nov 18 , 2024 | 11:49 PM