An impressive Kalki car
ABN, Publish Date - Jul 07 , 2024 | 11:54 PM
పాన్ ఇండియా చిత్రం కల్కిలో హీరో ప్రభాస్ వినియోగించి న బుజ్జికారు అందరినీ ఆకట్టుకుంది.
రింగురోడ్డు : పాన్ ఇండియా చిత్రం కల్కిలో హీరో ప్రభాస్ వినియోగించి న బుజ్జికారు అందరినీ ఆకట్టుకుంది. సినిమా ప్రమో షన్‌లో భాగంగా ఆ వాహ నాన్ని ఆదివారం నగరంలోని రామనారాయాణానికి అభిమానుల సందర్శనార్థం తీసుకొ చ్చారు. ముందుగా ఆలయ అర్చకులు బుజ్జికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కల్కి చిత్రంలోని బుజ్జి కారు నగరానికి వచ్చిందని తెలుసుకున్న సినీ అభిమానులు, పిల్లలు, యువత పెద్దఎత్తున బుజ్జిని చూసేందుకు రామానారాయణం క్షేత్రానికి తరలివెళ్లారు. ఆకర్షణీయంగా ఉన్న కారును చూసి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఆనందించారు.
ప్రత్యేకతలు ఇవీ..: కారుకు 3 చక్రాలు ఉంటాయి. ముందుభాగంలో 2 హబ్ లెస్ టైర్లు, వెనుక ఒకటి ఉంటుంది. డ్రైవర్‌కు స్పెషల్ సిటింగ్ ఉండగా పైన గ్లాస్ డూం ఉంటుంది. దీని నిర్మాణ వ్యయం రూ.7 కోట్లు అని, ఇదీ పూర్తిగా ఆర్టిఫీషి యల్‌గా పనిచేస్తుందని నిపుణలు తెలిపారు. కార్యక్రమంలో రామనారాయణం ప్రతినిధి రమణ, బుజ్జికారు ఇన్‌చార్జి రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 11:54 PM