ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హతలున్నా.. ఏం లాభం?

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:44 PM

జిల్లాలో ఎంతోమంది రేషన్‌కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అర్హతలున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. ప్రధానంగా సామాజిక పింఛన్లను నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు.

గత వైసీపీ సర్కారు హయాంలో అనర్హులకు పెద్దపీట

నాడు ఎంతో మంది లబ్ధిదారులకు మొండిచేయి

ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయం

రేషన్‌కార్డులు లేక పింఛన్లు, తదితర వాటికి దూరం

కూటమి ప్రభుత్వం స్పందించాలని విన్నపం

పార్వతీపురం, నవంబరు16 (ఆంధ్రజ్యోతి)

- పార్వతీపురానికి చెందిన పార్వతికి ఆధార్‌కార్డు ఉంది. కానీ రేషన్‌ కార్డు లేదు. రేషన్‌ కార్డు మంజూరైతేనే గాని పింఛను రాదు. దీంతో ఆమె కొత్త రేషన్‌కార్డు కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

- జిల్లా కేంద్రం పార్వతీపురానికి చెందిన ఓ మహిళ కుమారుడు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో ఆమె వితంతవు పింఛన్‌ నిలిపివేశారు. ప్రత్యేకంగా రేషన్‌కార్డు ఉంటేనే పింఛన్‌ మంజూరవుతుందని సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డు మంజూరు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.

... ఇలా వారిద్దరే కాదు జిల్లాలో ఎంతోమంది రేషన్‌కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అర్హతలున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. ప్రధానంగా సామాజిక పింఛన్లను నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు.

గత వైసీపీ సర్కారు తీరుతో..

పార్టీలకతీతంగా అర్హలందరికీ సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. కానీ గత వైసీపీ సర్కారు నిర్వాకంతో జిల్లాలో చాలా మందికి న్యాయం జరగడం లేదు. వాస్తవంగా సామాజిక పింఛను మంజూరు కావాలంటే రేషన్‌కార్డు తప్పనిసరి. అయితే గతంలో అత్యఽధికంగా వైసీపీ కార్యకర్తలు, నేతల అనుచరులకే రేషన్‌కార్డులు మంజూర య్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తల కుటుంబాలతో పాటు అర్హులైన ఎంతోమందికి రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. గత ఐదేళ్లూ.. రేషన్‌కార్డులు ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ మద్దతుదారుల పింఛన్లకు నోచుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తా మని ప్రకటించినప్పటికీ రేషన్‌కార్డులు లేని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

కొంతమంది పరిస్థితి ఇలా...

- ఉద్యోగస్థులైన ఆడబిడ్డలు వివాహాలైన అనంతరం అత్తవారింటికి వెళ్లిపోయినా వారి పేర్లు మాత్రం ఇప్పటికీ తల్లిదండ్రుల రేషన్‌ కార్డుల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో అన్ని అర్హతలున్నా.. అటువంటి తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. తమ ఆడబిడ్డల పేర్లు రేషన్‌ కార్డుల నుంచి తొలగించాలని వారు గత ఐదేళ్లుగా సచివాలయాలు, ఎంపీడీవోల కార్యాల యాల చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటివరకు ఎటువంటి చర్యల్లేవు.

- అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబానికి చెందిన తల్లిదండ్రులకు కూడా సామాజిక పింఛన్లు మంజూరు కావడం లేదు. తక్కువ వేతనానికి సదరు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ రేషన్‌కార్డులో వారి పేరు కూడా ఉండడంతో ఎంతోమంది వృద్ధులైన తల్లిదండ్రులు, వితంతువులైన తల్లులు పింఛన్లు పొందలేకపోతున్నారు.

రేషన్‌కార్డులు ఇలా..

పార్వతీపురం డివిజన్‌లో 1,56,418, పాలకొండ డివిజన్‌లో 1,24,833 రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్‌కార్డుల మంజూరు మార్చి నుంచి నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. కొత్తగా పెళ్లయిన వారితో పాటు గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన అర్హులు, ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన వారికి.. ప్రభుత్వం తక్షణమే రేషన్‌కార్డులు అందించి.. సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను అందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఆదేశాలు రాలేదు

కొత్త రేషన్‌ కార్డుల మంజూరు కోసం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు అందిన వెంటనే నూతన రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తాం.

- శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎస్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 16 , 2024 | 11:44 PM