పైడిమాంబను స్మరిస్తూ నగరంలో ర్యాలీ
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:01 AM
పైడిమాంబ దీక్షదారులు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడితో నడుస్తూ అమ్మవారి స్మరణతో హోరెత్తించారు. ఉదయం 6 గంటలకు చదురుగుడి నుంచి గంటస్తంభం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎన్‌సీఎస్ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డులో వున్న వనంగుడి వరకూ పాదయాత్ర చేశారు.
పైడిమాంబను స్మరిస్తూ
నగరంలో ర్యాలీ
ఇరుముడితో నడిచిన దీక్షదారులు
విజయనగరం రూరల్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ దీక్షదారులు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడితో నడుస్తూ అమ్మవారి స్మరణతో హోరెత్తించారు. ఉదయం 6 గంటలకు చదురుగుడి నుంచి గంటస్తంభం, కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎన్‌సీఎస్ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డులో వున్న వనంగుడి వరకూ పాదయాత్ర చేశారు. సిరిమానోత్సవం కార్యక్రమంలో భాగంగా మండల, అర్ధమండల దీక్షలు చేసిన పైడిమాంబ దీక్షాదారులు అంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం దీక్షను విరమింపచేశారు. చండీహోమం, పూర్ణాహుతి అయ్యాక ఇరుముడులు పైడిమాంబకు సమర్పించి దీక్ష విరమణ చేశారు. దీక్షాదారుల సంఘం ప్రతినిధులు మహాపాత్రో, అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తంతు జరిగింది. ఆలయ ఈవో డీవీ ప్రసాదరావు, సూపరింటెండెంట్ ఏడు కొండలు, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతోపాటు అర్చకులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
---------
Updated Date - Oct 31 , 2024 | 12:04 AM