ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:05 AM

పార్వతీపురంలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకుని వస్తున్న బస్సు కొమరాడ మండలంలోని డంగభద్ర సమీపంలో అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొంది.

కొమరాడ: పార్వతీపురంలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకుని వస్తున్న బస్సు కొమరాడ మండలంలోని డంగభద్ర సమీపంలో అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎటు వంటి ప్రమాదం జరగనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం రాజ్యలక్ష్మీపురం గ్రామం వైపు వస్తున్న బస్సు.. డంగభద్ర సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి జంఝావతి ఎగువ కాలువపై ఉన్న కల్వర్టు గోడను ఢీకొంది. గోడను బలంగా ఢీకొట్టి ఉంటే బస్సు కాలువలోకి పడిపోయే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు కొమరాడ ఎస్‌ఐ నీలకంఠం ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నా రు. ఎస్‌ఐ దగ్గరుండి వారందరినీ వారి స్వగృహాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:05 AM