ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎండీపీవో కార్యాలయాలకు మోక్షం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:14 AM

ఉమ్మడి జిల్లా పరిధిలో శిఽథిలావస్థలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. మొత్తంగా 13 నూతన భవనాలు మంజూరు చేస్తూ జడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజు ఆదేశాలు జారీ చేశారు.

శిథిలావస్థలో ఉన్న గరుగుబిల్లి ఎంపీడీవో కార్యాలయం

గరుగుబిల్లి, సెప్టెంబరు 15 : ఉమ్మడి జిల్లా పరిధిలో శిఽథిలావస్థలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. మొత్తంగా 13 నూతన భవనాలు మంజూరు చేస్తూ జడ్పీ సీఈవో ఎల్‌ఎన్‌వీ శ్రీధర్‌రాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీవోలకు సమాచారం అందించారు. మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ, విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ, గుర్ల, మొరకముడిదాం, గంట్యాడ, తెర్లాం, జామి, వంగర మండలాలకు భవనాలు మంజూరు చేశారు. ఈ మేరకు కార్యాలయ భవనాల ప్రస్తుత పరిస్థితి తెలిపే ఫొటోలు, నిర్మాణ ప్రణాళికలు, పౌండ్‌ నెస్‌ సర్టిఫికేట్‌, నిధులు లభ్యతలు, నిల్వ వివరాలు, అంచనా విలువల ప్రతిపాదనలు, మండల ప్రజాపరిషత్‌ తీర్మానంతో పాటు తదితర సమాచారాన్ని త్వరితగతిన అందించాలని ఎంపీడీవోలకు ఆదేశాలు అందాయి.

Updated Date - Sep 16 , 2024 | 12:15 AM

Advertising
Advertising