ఉద్యోగులకు భద్రత కల్పించాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:34 AM
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగులు కోరారు.
పాలకొండ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగులు కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తమను వైద్య ఆరోగ్యశాఖ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఈ సర్వీస్ ప్రొవైడర్లు మారినప్పుడల్లా తాము ఆర్థికంగా చితికి పోయామన్నారు. ఈ నెల 108 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈనెల 25వ తేదీ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి వెళతామని తెలిపారు.
సీతంపేట రూరల్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 108 సిబ్బంది ఈనెల 25వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు జి.అప్పలనాయుడు తెలిపారు. గురువారం ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, ఈ సర్వీస్ ప్రొవైడర్‌లు మారినప్పు డు తాము ఆర్థికంగా చితికిపో తున్నామని అన్నారు. 108 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బలిజిపేట, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ఉద్యోగులు రెడ్డి ధనుంజయనాయుడు, సత్యనారాయణ, శంకరరావు, నాగరాజు తదితరులు కోరారు. వారు గురువారం మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి ఈనెల 25వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని తెలిపారు.
Updated Date - Nov 15 , 2024 | 12:34 AM