బొబ్బిలిలో కబ్జాలే కబ్జాలు
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:22 AM
బొబ్బిలి ప్రాంతంలో భూ కబ్జాల పర్వంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగ తి తెలిసిందే. ఒక్క బొబ్బిలి మండలంలోనే సుమారు 200 ఎకరాలకు పైగా భూములను కబ్జాదారులు హస్తగతం చేసు కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
- విచారణలో అధికారులు బిజీబిజీ
- ఎక్కడికక్కడే అక్రమాలు
బొబ్బిలి/బొబ్బిలి రూరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ప్రాంతంలో భూ కబ్జాల పర్వంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగ తి తెలిసిందే. ఒక్క బొబ్బిలి మండలంలోనే సుమారు 200 ఎకరాలకు పైగా భూములను కబ్జాదారులు హస్తగతం చేసు కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మారుతున్న ప్రతిసారీ ఈ భూ భాగోతాలు తెరమీదకు వస్తున్నాయి. గ్రీవెన్స్‌లోనో... ఇతరత్రా గానీ ఫిర్యాదులు అందగానే రెవెన్యూ అధికారులు ఆ భూముల పరిశీలనకు పరుగులు తీస్తు న్నారు. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది మామూళ్లకు ఆశ పడి భూముల రికార్డులను తారుమారు చేశారని, హక్కులను బదలాయిం చారన్నవి ప్రఽధానమైన ఆరోపణలు. వీటిలో కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. కేసులలో ఉన్న భూముల జోలికి అధికారులు పోవడం లేదు. గిరిజనుల భూములు, అటవీ భూములు సైతం కబ్జాల కోరల్లో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కదిలిన రెవెన్యూ యంత్రాంగం
బొబ్బిలి పరిసరాలలో ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం కదిలింది. తహసీల్దారు మలపురెడ్డి శ్రీను భూ కబ్జాల ఆరోపణలపై విచారణ చేపడుతు న్నారు. ఇందిరమ్మ కాలనీలో సుమారు 400 ఖాళీ స్థలాల్లో సగానికి పైగా కొంతమంది ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ కొనసాగుతోంది. గతంలో అనేకసార్లు దర్యాప్తు పర్వాలు సాగాయి. ఎప్పటి కప్పుడు ఈ తతంగం మొదటికి వస్తోంది. గతంలో పని చేసిన అధికారులు ఇష్టారాజ్యంగా పట్టాలు జారీ చేయడం తో ఈ సమస్య తీవ్ర తరమైంది. కొన్నిటిని అధికారికంగా... మరికొన్నిటికి ఎటువంటి ఆధారాలు లేకుండా పట్టాలను జారీ చేసేశారు. దీనిపై రెవెన్యూ, మున్సిపల్, పంచాయితీరాజ్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా విచారణ చేపట్టి... ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే యోచనలో రెవెన్యూ అధికారులు ఉన్నారు.
- మిలటరీ కాలనీలో ఇదే పద్ధ తిలో పట్టాలు జారీ చేసినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేపడుతున్నారు. ఆక్ర మణలను తొలగిస్తున్నారు.
- నిమ్మలపాడు గిరిజన ప్రాంతంలో స్థానికేతరులు భూకబ్జాలకు పాల్పడి నట్లు ఆరోపణలు రావడంతో వాటిపై తహసీల్దారు బృందం శనివారం విచారణ చేపట్టారు. సుమారు 13 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అందు లో 3.23 ఎకరాలకు రైతులు పత్రాలు చూపిస్తున్నారు. మిగిలిన వాటికి ఆధారాలు చూపించేందుకు గడువు ఇచ్చారు. కొయకొం డవలస-చెల్లియ్యవలసలోని పదెకరాల గిరిజన భూములపై తాజాగా ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతోంది. సం బంఽధిత వ్యక్తులు ఆధారాలను చూపించుకోవాలని తహసీ ల్దారు వారికి గడువు ఇచ్చారు.
- మల్లమ్మపేట అటవీ పరిధిలో 450 హెక్టార్లలో భూములు ఉన్నాయి. వాటిలో సగం భూములను కొంతమంది సాగు చేసుకోవడం, ఇంకొంతమంది వేరే అవసరాలకు వినియో గించడం జరుగుతోంది. దీనిపై చాలా ఏళ్ల నుంచి వివాదం నలుగుతోంది. అటవీ-రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో ఈ వివాదం తెగడం లేదు.
- పారాది-కాశిందొరవలస గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీల మధ్య 125 ఎకరాల భూములకు సంబంధించిన వివాదం రెండు దశాబ్దాల నుంచి నడుస్తోంది. భూములకు నిజమైన హక్కుదారులు ఎవరనేది తేలకపోవడంతో వివాదం సద్దుమణగడం లేదు. ఇది కూడా కోర్టు కేసుల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
- గొల్లపల్లి, మల్లమ్మపేట ప్రాంతాలలో ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
- గొర్లెసీతారాంపురం రెవెన్యూ పరిధిలో పేరుగాంచిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెండు గోర్జీలను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సంబంధిత యజమానికి నోటీసులు జారీ చేశారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే తరహాలో కబ్జాల కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భూ వివాదాలపై విచారణ
బొబ్బిలి మండలంలో పదికిపైగా భూ వివాదాలపై స్వయంగా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాను. మిలటరీ కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఆక్రమణలను తొలగించి బోర్డులను ఏర్పాటు చేశాం. ఇందిరమ్మ కాలనీలో దొంగపట్టాలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై రెవెన్యూ, మున్సిపల్, పంచాయితీ రాజ్ సిబ్బందితో సంయుక్తంగా దర్యాఫ్తు నిర్వహించి నిగ్గుతేల్చుతాం. భూ యజమానులుగా చెప్పుకునే వారు తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను చూపించాలి. లేదంటే వాటిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- ఎం.శ్రీను, తహసీల్దారు, బొబ్బిలి
Updated Date - Nov 24 , 2024 | 12:22 AM