ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్తా చాటారు

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:09 AM

మండల కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు జోనల్‌ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపర్చారు.

గరుగుబిల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు జోనల్‌ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపర్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో నిర్వహించిన జోనల్‌ పోటీల్లో కళాశాలకు చెందిన విద్యార్థినులు వాలీబాల్‌ సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు, అథ్లెటిక్స్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు. మొత్తంపై 10 విభాగాల్లోనూ తగిన ప్రతిభ కనపర్చి కళాశాలకు తగిన గుర్తింపు తెచ్చారని ప్రిన్సిపాల్‌ ఎస్‌.సంధ్యారాణి, పీఈటీ యమున తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముగింపును పురస్కరించుకుని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కోఆర్డినేటర్లు బాలాజీనాయుడు, రూపవతి, ఫ్లోరెన్స్‌ల సమక్షంలో మెమోంటోలతో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. గతంలో పలు ధపాలు విద్యార్ధినులు క్రీడల్లో పాల్గొని కళాశాలకు తగిన గుర్తింపు తీసుకువచ్చారన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 12:09 AM