కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:37 PM
కల్తీ విత్తనాలు విక్రయించి.. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్ హెచ్చరించారు. మంగళవారం సాలూరు అగ్రిల్యాబ్‌లో రైతులు, విత్తన సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
సాలూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): కల్తీ విత్తనాలు విక్రయించి.. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్ హెచ్చరించారు. మంగళవారం సాలూరు అగ్రిల్యాబ్‌లో రైతులు, విత్తన సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్నదాతలు పలు సమస్యలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు ఇచ్చే ముందు ఆయా విత్తన సంస్థల ప్రతినిధులు ఎంఓయూలు చేసుకోవాలని సూచించారు. పంటకు నష్టం వాటిల్లితే తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులపై రుబాబు చేస్తే సహించేది లేదని తెలిపారు. మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి మక్కువ మండలంలో 42 మందికి, పాచిపెంట మండలంలో 18.8 ఎకరాలకు గాను పలువురు రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయమై ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడామన్నారు. ఆయన వెంట ఏడీ మధుసూదనరావు, ఏవోలు ఉన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:37 PM