ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సబ్‌జైలును పరిశుభ్రంగా ఉంచాలి

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:33 AM

స్థానిక సబ్‌జైలు పరిసరాలు, సెల్స్‌ పరిశుభ్రంగా ఉంచుకోవా లని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూ చించారు.

పాలకొండ: స్థానిక సబ్‌జైలు పరిసరాలు, సెల్స్‌ పరిశుభ్రంగా ఉంచుకోవా లని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా సూ చించారు. పాలకొండ సబ్‌జైలును పాలకొండ సివిల్‌ న్యాయాధికారి విజయరాజ్‌ కుమార్‌తో కలిసి ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు. జైలులో ఖైదీలు ఉండే సెల్స్‌, స్నానపు గదులు, మలమూత్ర విసర్జన గదులను పరిశీలించారు. మొత్తం జైల్లో ఎన్ని గదులు ఉన్నాయని జైలు సూపరింటెండెంట్‌ జోగులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం జైలులో ఉన్నా రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. ఏ నేరం మీద వచ్చారని, జైల్లో సదుపాయాలపై అడిగి తెలుసు కున్నారు. రిమాండ్‌ ఖైదీల కు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు. వంటరూం, స్టాక్‌రూంలను తనిఖీ చేశారు. జైల్లో పండిస్తున్న కూరగాయలపై అడిగి తెలుసు కున్నారు. జైలు పరిసరాలు కలియతిరిగి, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రిమాండ్‌ ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎస్‌ఐ ఎన్‌.ప్రశాంత్‌కుమార్‌, జైలు హెడ్‌వార్డర్స్‌ పి.చంద్రరావు, బి.విజయ్‌కుమార్‌లతో పాటు న్యాయవాదులు బి.రామ్మోహన్‌రావు, పి.మునిస్వామి, కె.రవి, ఎం.వెంకటేశ్వరరావు, శామ్యూల్‌, జైలు సిబ్బంది పి.మధు, నాగరాజు, నాయు డులతో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:33 AM

Advertising
Advertising