ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:22 AM

టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 26న ప్రారంభమవుతుందని.. దీనిని విజయవంతం చేయాలని సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శ్రేణులకు పిలుపునిచ్చారు.

విజయనగరం రూరల్‌, అక్టోబరు 19: (ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 26న ప్రారంభమవుతుందని.. దీనిని విజయవంతం చేయాలని సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్ల పాలన ప్రజా వ్యతిరేకంగా సాగిందన్నారు. అందుకనే ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని.. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. కూటమి నేతలు నిర్లిప్తత వహించకుండా నిత్యం ప్రజల మధ్యకు వెళుతూ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ప్రతి క్రీయాశీలక సభ్యుడికి ప్రమాద బీమాను వర్తింపజేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, ఆల్తి బంగారుబాబు, కర్రోతు వెంకట నర్సింగరావు, అనురాధబేగంతో పాటు, టీడీపీ డివిజన్‌ ఇన్‌ఛార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:22 AM