ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త రేషన్‌ కార్డులకు రంగం సిద్ధం

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:42 PM

జిల్లాలో అర్హులైన వారికి ప్రభుత్వం నూతనంగా రేషన్‌ కార్డులు అందించనుంది. సంక్రాంతి కానుకగా వాటిని మంజూరు చేయనుంది. ఇందుకోసం ఈనెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది.

చేరికలు, తొలగింపులకు అవకాశం

2 నుంచి అందుబాటులోకి సర్వర్‌

పార్వతీపురం, నవంబరు30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అర్హులైన వారికి ప్రభుత్వం నూతనంగా రేషన్‌ కార్డులు అందించనుంది. సంక్రాంతి కానుకగా వాటిని మంజూరు చేయనుంది. ఇందుకోసం ఈనెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంతో జిల్లాలో ఎంతోమంది వాటి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా వివాహాలైన వారు, కార్డుల్లో తొలగింపులు, చేర్పులు చేయాల్సిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి వారందరూ దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 2 నుంచి సర్వర్‌ అందుబాటులోకి రాగా.. త్వరితగతిన దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అర్హులకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్‌కార్డులను ప్రభుత్వం అందజేయనుంది.

గత వైసీపీ సర్కారు హయాంలో..

గత వైసీపీ సర్కారు పాలనలో రేషన్‌ కార్డుల మంజూరు ఏకపక్షంగా సాగింది. టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రేషన్‌ కార్డులు పొందలేకపోయారు. అన్ని అర్హతలున్నా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాటికి దూరమయ్యారు. కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా గత ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా ఈ ప్రక్రియను నిలిపివేశారు. దీంతో ఎంతోమంది రేషన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగినులు వివాహాలై అత్తారింటికి వెళ్లిపోయినప్పటికీ రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నాయనే కారణంతో వారి తల్లిదండ్రులకు సంక్షేమ పథకాలు అందించేవారు కాదు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు చేసిన వారి తల్లిదండ్రులు కూడా గతంలో పింఛన్‌ తదితర వాటికి దూరమయ్యారు. అయితే ఇటువంటి కష్టాలకు చెక్‌ పెట్టాలని కూటమి ప్రభుత్వ భావించింది. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో అందించిన రేషన్‌ కార్డులు కూడా మారనున్నాయి.వాటిపై ఆ ఫొటోలను తొలగించి.. నూతనంగా కార్డులను అందించనున్నారు.

ఆదేశాలు రావల్సి ఉంది

కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ ఈ నెల రెండో తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వ ఆదేశాలు రావల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొత్త రేషన్‌కార్డులు మంజూరుతో పాటు చేర్పులు, మార్పులు, తొలగింపుల ప్రక్రియ చేపడతాం.

- శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎస్‌వో, పార్వతీపురం మన్యం

Updated Date - Nov 30 , 2024 | 11:42 PM