ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జూట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:35 AM

రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమలను ఆదుకోవాలని రాష్ట్ర జూట్‌ పరిశ్రమల అసోసియేషన్‌ ప్రతినిధులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

చీపురుపల్లి: రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమలను ఆదుకోవాలని రాష్ట్ర జూట్‌ పరిశ్రమల అసోసియేషన్‌ ప్రతినిధులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కిమిడి నాగార్జున నేతృత్వంలోని యూనియన్‌ ప్రతినిధులు టీవీఎస్‌ లింగమూర్తి, సునీల్‌, హర్ష నహత తదితరులు మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో జూట్‌ పరిశ్రమ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటుందన్నారు. దీనికారణంగా లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ పరిశ్రమల్ని ఆదుకోవాలని వారు కోరారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి ఉత్తరాంధ్రలో జూట్‌ పరిశ్రమల బాగు కోసం తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ విషయంలో సంబంధిత మంత్రితో మాట్లాడి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Aug 14 , 2024 | 12:35 AM

Advertising
Advertising
<