ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజనుల అభివృద్ధే ధ్యేయం

ABN, Publish Date - Nov 15 , 2024 | 11:56 PM

గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. విద్యతో పేదరికం, దోపిడీ వంటి వ్యవస్థల నుంచి బయటపడొచ్చని.. ప్రగతి బాటలో పయనించొచ్చని చెప్పారు. ఐక్యతతో హక్కులు కాపాడుకో వచ్చన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం పార్వతీపురం ఐడీడీఏ ఆవరణలో జన జాతీయ గౌరవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం/ బెలగాం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. విద్యతో పేదరికం, దోపిడీ వంటి వ్యవస్థల నుంచి బయటపడొచ్చని.. ప్రగతి బాటలో పయనించొచ్చని చెప్పారు. ఐక్యతతో హక్కులు కాపాడుకో వచ్చన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం పార్వతీపురం ఐడీడీఏ ఆవరణలో జన జాతీయ గౌరవ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. జన్‌మాన్‌ కింద రూ.75 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజనుల విద్య, ఆరోగ్యానికి ప్రత్యేక చొరవ తీసుకు న్నట్లు చెప్పారు. విద్యా, ఉద్యోగాల్లో గిరిజనులు ఉన్నత స్థానాల్లో ఉండాలని, క్రీడల్లోనూ సత్తాచాటి జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని సూచించారు. గిరిజన వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే తెలియ జేయాలన్నారు.గిరిజనులకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వన్‌ధన్‌ కేంద్రాను బలోపేతానికి రూ.15.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొండకోనల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు చైతన్యవంతులు కావాలని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డీవీజీ శంకర్రావు అన్నారు. అనంతరం వారు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. గుమ్మలక్ష్మీపురం కురుపాం ఏకలవ్య మోడల్‌ పాఠశాల, గిరిజన గురుకులం, రేగడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు థింసా నృత్యాలు, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆశుతోస్‌ శ్రీవాస్తవ, ఎస్పీ మాధవరెడ్డి, ఏసీపీ అంకిత సురాన, పార్వతీపురం మున్సిపల్‌ చైర్మన్‌ గౌరీశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత ఎండీ గయాజుద్దీన్‌, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు, గిరిజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పాల ఉత్పాదకతను పెంచాలి

పార్వతీపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాల ఉత్పాదకతను 15 శాతం పెంచాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాథమిక రంగాల శాఖలతో ఆయన సమీక్షించారు. అధిక పాల ఉత్పత్తికి అనువైన గోవులను ప్రోత్సహించాలని తెలిపారు. దాణాలో ఉత్తమ విధానాలు అవలంబించాలని సూచించారు. డీ వార్మింగ్‌, ఇమ్యునైజేషన్‌ విధిగా చేయాలన్నారు. సంతులిత ఆహారం అందించడంలో గోపాలమిత్రలు క్రియాశీలకంగా ఉండాలని ఆదేశించారు. నీటి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ప్రతి మండలంలో ఐదు ఎకరాల్లో పశు గ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్‌ యువర్‌ డీఎహెచ్‌వో కార్యక్రమం ప్రతి నెలా నిర్వహించాలన్నారు. ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా ఈ నెల 19 నుంచి డిసెంబరు 10వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ ఆఽధారిత పంటల బీమా జీడీ రైతులకు ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఇప్పుడు ప్రీమియం చెల్లిస్తే.. 2024-25 రబీ సీజన్‌కు బీమా వర్తిస్తుందన్నారు. ఈ-క్రాప్‌లో నమోదైన వారందరూ అర్హులన్నారు. పంట నమోదు పత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, 1బీ/ పట్టాదారు పాస్‌ పుస్తకం కాపీలతో మీ సేవ కేంద్రానికి చేరుకుని ఎకరానికి రూ.1600 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. ఇతర వివరాలకు ఈ 95500 44894 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మన్మఽథరావు, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు సత్యంనాయుడు, కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Nov 15 , 2024 | 11:56 PM