ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదు

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:33 PM

తుఫాన్‌ కారణంగా జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

- కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ కారణంగా జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా, మండల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాలను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించే వారిని వసతి గృహాలకు తరలించాలన్నారు. కొండవాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలోజరిగే నష్టాలను పరిశీలించేందుకు ప్రతి మండలంలో చిన్న డ్రోన్లను సిద్ధం చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం నీటి వినియోగదారుల సంఘాలు, 26న డిస్ట్రిబ్యూటరీ, 28న ప్రాజెక్టు కమిటీల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ప్ర క్రియను జాగ్రత్తగా నిర్వహించి జిల్లాలో సజావుగా ఎన్నికలు జరిపించాలని మండల అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:33 PM