ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:20 AM
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను డెప్యుటేషన్ వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను డెప్యుటేషన్ వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమస్యలు పరిష్కారం చేయకుండా వారిని మరింత ఆందోళన గురిచేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించాలి
బెలగాం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాల, కళాశాలల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యా యుల పోరాటానికి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ కోరారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల రిలే దీక్ష పదో రోజు శుక్రవారం కొనసాగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల స్థానంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపా ధ్యాయులను డెప్యుటేషన్‌పై వేసి పాఠశాలను నడిపించాలని అధికారులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని యూటీఎఫ్ ఖండి స్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమేష్, దివాకర్, రాజేష్, వెంకట్, అరసాడ రమేష్, రాయల వెంకట్, గిరిజన సంఘం నాయకులు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:21 AM