పీజీఆర్‌ఎస్‌కు ఉన్నతాధికారులే రావాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:11 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. హెడ్ అఫ్ ఇనిస్టిట్యూషన్ అధికారులు కాకుండా ఆ శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరైతే బయటకు పంపిస్తామన్నారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు ఉన్నతాధికారులు విధిగా హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. హెడ్ అఫ్ ఇనిస్టిట్యూషన్ అధికారులు కాకుండా ఆ శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరైతే బయటకు పంపిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు ఒక వారం మన్యంలో , మరొక వారం విజయనగరం పీజీఆర్‌ఎస్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం కావాలని, ఈ ప్రక్రియ స క్రమంగా నిర్వహిచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 5న జాబితా ప్రచురించాలని, 6న గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు.
రక్తహీనత లోపం ఉండరాదు
జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, వసతిగృహాల్లో చదివే విద్యార్థినుల్లో రక్తహీనత లోపం ఉండరాదని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎక్కడైనా రక్తహీనత కేసులు నమోదైతే సంబంధిత వసతిగృహ వార్డెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వసతిగృహాల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. పల్లె నిద్రలు, గ్రామదర్శిని కార్యక్రమాల్లో గుర్తించిన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటికే కొందరు అధికారులు దోమ తెరలు పంపిణీ చేశారని, మరికొందరు తరగతి గదులు, వసతిగృహాల్లో లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారని తెలిపారు.
పీఎం ఆవాస యోజన ఇళ్లకు నమోదు
ప్రధానమంత్రి ఆవాస యోజన అర్బన్ పథకం కింద ఇళ్ల కోసం లబ్ధిదారులు నమోదు చేసుకోవాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. భార్యాభర్తలు సంతకం చేసిన ఆధార్‌కార్డు నకలు, రేషన్‌కార్డు , బ్యాంకు పాస్‌బుక్, స్థలం అనుబంధ పత్రం లేదా రిజిస్టర్ డాక్యుమెంట్, ఈసీ ఆదాయం, కుల ధ్రువీకరణపత్రం తదితర డాక్యుమెంట్స్ కాపీలు అందించాలన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:11 PM