ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తుఫాన్‌పై అప్రమత్తం

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:48 PM

తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికారులంతా అప్రమత్తం కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం తన క్యాంప్‌ కార్యాల యం నుంచి జిల్లా, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా అధికారులంతా అప్రమత్తం కావాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం తన క్యాంప్‌ కార్యాల యం నుంచి జిల్లా, మండల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్‌ కారణంగా గురువారం నుంచి జిల్లాలో ఈదురుగాలులుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు వర్షాలు, వరదల పరిస్థితిని గమనించాలని, మట్టి ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే వారిని సురక్షిత భవనాల్లోకి తరలించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి, సూచనల బోర్డులను ఉంచాలన్నారు. విపత్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెవెన్యూ అధికారులను, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు.

హైరిస్క్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలి

జిల్లాలో రక్తహీనతతో బాధపడే గర్భిణులను గుర్తించాలని, ఇలాంటి హైరిస్క్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో మాట్లాడారు. ‘జిల్లాలో ఎటువంటి మాతా శిశు మరణాలు జరగకూడదు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. హైరిస్క్‌ కేసులను ముందే గుర్తించి వారికి అవసరమైన వైద్యం, మందులు అందించాలి. మాతా శిశు మరణాల మృతికి కారణమయ్యే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రతీ ఆసుపత్రిలో ఒక నెలలో జరిగిన ప్రసవాలు, అందులో హైరిస్క్‌ కేసులు విధిగా గుర్తించి నివేదికలు సమర్పించాలి. గర్భిణులను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్‌ చేసినా, ఏఎన్‌ఎంలు తీసుకెళ్లినట్టు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి కేసులు నమోదు కాకుండా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలి. పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని’ కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి కె.విజయపార్వతి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బి.వాగ్దేవి, డీఎల్‌టీవో డాక్టర్‌ వినోద్‌కుమార్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:48 PM