ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉపాధి’లో మనమే టాప్‌

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:53 PM

ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా పని దినాలను వినియోగించుకోవడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

పార్వతీపురం, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా పని దినాలను వినియోగించుకోవడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 87 లక్షల 60 వేల పనిదినాలను వేతనదారులు వినియోగించుకుంటే ఈ సంవత్సరంలో 1.04 కోట్ల పనిదినాలు వినియోగించుకున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 450 గ్రామ పంచాయతీలుండగా.. వాటిల్లో రెండు లక్షల 9 వేల జాబ్‌కార్డులున్నాయి. మొత్తంగా మూడు లక్షల 96 వేల మంది వేతనదారులు ఉన్నారు. ప్రస్తుతం 193 వేల జాబ్‌కార్డులు యాక్టివిటీలో ఉండగా.. మూడు లక్షల 51 వేల మంది పనులు చేపడుతున్నారు. వేతనదారులు అత్యధికంగా పని దినాలు వినియోగించుకోవడం వల్లే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్లు డ్వామా పీడీ రామచంద్రరావు తెలిపారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశాల మేరకు అర్హులందరికీ పనులు కల్పిస్తున్నామన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:53 PM