ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నకిలీ విత్తనాలతో నష్టపోయాం

ABN, Publish Date - Oct 08 , 2024 | 12:04 AM

నకిలీ విత్తనాలు విక్రయించిన వారి పై చర్యలు తీసుకుని, నష్టం పరిహారం చెల్లించాలని మక్కువ మండలం నంద పంచాయతీకి చెందిన 13 మంది గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న గిరిజన రైతులు

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి/ బెలగాం: నకిలీ విత్తనాలు విక్రయించిన వారి పై చర్యలు తీసుకుని, నష్టం పరిహారం చెల్లించాలని మక్కువ మండలం నంద పంచాయతీకి చెందిన 13 మంది గిరిజన రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మక్కువ గ్రామానికి చెందిన ఇద్దరు కంపెనీ ఏజెంట్లు వద్ద మొక్కజొ న్న విత్తనాలు కొనుగోలు చేసి సుమారు 20 ఎకరాల్లో నాట్లు వేశామని చెప్పారు. ఈ నకిలీ విత్తనాల కారణంగా ఎకరాకు రూ.75వేలు చొప్పున నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుని, తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. గిరిజన రైతులు పాల్గొన్నారు.

దర్యాప్తునకు కలెక్టర్‌ ఆదేశం

నకిలీ విత్తనాలు వల్ల గిరిజనులు మోసపోవడంపై కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ తీవ్రంగా స్పందించారు. వెంటనే గ్రామానికి వెళ్లి నకిలీ విత్తనాలు వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు, పంట ఎంతవరకు నష్టపోయింది, విస్తీర్ణంతో పాటు రైతుల వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని వెంటనే నివేదికను అందించాలని జిల్లా వ్యవసాయా ధికారి రాబర్ట్‌పాల్‌కు ఆదేశించారు.

Updated Date - Oct 08 , 2024 | 12:04 AM