ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారి పరిస్థితేంటి?

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:44 PM

ఇంటర్‌ విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇదే ప్రాంగణంలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

రెండుపూటలా ఇంటర్‌ తరగతుల నిర్వహణకు ఆదేశాలు

ఆందోళనలో డిగ్రీ విద్యార్థులు

టైం టేబుల్‌ మారడంతో తలలు పట్టుకుంటున్న సిబ్బంది

వీరఘట్టం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తరగతుల నిర్వహణకు సంబంధించి టైం టేబుల్‌ మారింది. సోమవారం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఇదే ప్రాంగణంలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిస్థితేమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ పరిస్థితి..

- వాస్తవంగా 2008లో మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైంది. అయితే అప్పటి నుంచి జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ విద్యార్థులుకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు డిగ్రీ వారికి, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1982లో దాతల సాయంతో ఇంటర్‌ కళాశాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి మధ్యాహ్నం పూటే తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారులు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంది.

- ఈ కళాశాలలో మొత్తంగా ఎనిమిది గదులున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 202 మంది, ద్వితీయ సంవత్సరంలో 126 మంది విద్యార్థులున్నారు. అయితే గదులు చాలకపోవడంతో ఆరు బయటే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్‌ వారికి రెండుపూటలా తరగతులు నిర్వహిస్తే వంద మంది డిగ్రీ విద్యార్థులకు ఎక్కడ తరగతులు నిర్వహించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

- యు.వెంకంపేట వద్ద మరియగిరి పక్కన ప్రభుత్వం డిగ్రీ కళాశాలకు ఐదెకరాల స్థలం కేటాయించారు. 2015లో భవనాల నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.5.25 కోట్లు మంజూరయ్యాయి. అయితే నిర్మాణ పనులు జరగకపవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు.

ఆదేశాలు పాటిస్తాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల రెండో తేదీ నుంచి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థులకు రెండు పూటలా తరగతులు నిర్వహిస్తాం. ఈ విషయం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేశాం. విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో కళాశాలకు రావల్సి ఉంటుంది.

- త్రినాథ్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

=============================

ఉన్నతాధికారులకు తెలియజేశాం

ఇంటర్‌ కళాశాలలో రెండు పూటలా తరగతుల నిర్వహణ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేశాం. వారి సూచనల కోసం ఎదురుచూస్తున్నాం.

- సుధాకర్‌రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

Updated Date - Nov 30 , 2024 | 11:44 PM