ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విజయమే లక్ష్యంగా పనిచేయండి

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:51 PM

ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య సూచించారు.

విశాఖలో జరిగిన టీడీపీ సమావేశంలో జిల్లా నేతలు

పార్వతీపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య సూచించారు. సోమవారం విశాఖలో పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచే యాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణారంగారావు, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు కె.శ్రావణ్‌ , ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు బోనెల విజయచంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ డి.రామకృష్ణ , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌, మాజీ ఎంపీపీ పి.తిరుపతిరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ డి.లక్ష్మణరావు, పాలకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:51 PM

Advertising
Advertising