పాము కాటుతో యువకుడు మృతి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:14 AM
సీడీమానుగూడ గ్రామలో పాము కాటుతో యువకుడు మృతి చెం దాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
కురుపాం: సీడీమానుగూడ గ్రామలో పాము కాటుతో యువకుడు మృతి చెం దాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరిక మోహన రావు(26) అనే వ్యక్తి ఇంటిలో నింద్రిస్తుండగా శనివారం రాత్రి పాము కాటేసింది. తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లమని చెప్పినా వినిపించుకోకుండా తనకు తెలిసిన పసరు మందు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా మోహ నరావు స్పృహ కోల్పోగా వెంటనే కుటుంబ సభ్యులు 108 ద్వారా కురుపాం ఆసు పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మోహన రావుకి భార్య శైలిజ, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Oct 08 , 2024 | 12:14 AM