ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓటర్‌ ట్రబుల్స్‌!

ABN, Publish Date - May 13 , 2024 | 05:23 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది, ఈవీఎంల వంటి సామగ్రి రవాణా కోసం 5458 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పోటెత్తిన ఓటర్లు.. చేతులెత్తేసిన ఆర్టీసీ

హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రయాణికుల తాకిడి

కిక్కిరిసిపోయిన బస్సులు, రైళ్లు

హైదరాబాద్‌ నుంచి బెజవాడ వరకే ప్రత్యేక బస్సులు

ఇక్కడి నుంచి జిల్లాలకు బస్సులు లేక ఇబ్బందులు

ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం, వాగ్వాదం

విజయవాడ, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆదివారం హైదరాబాద్‌ నుంచి ఓటర్ల వరద కొనసాగింది. ఎలాగైనా స్వస్థలాలకు చేరి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తాపత్రయంతో బస్సులు, రైళ్లు, కార్లలో పెద్ద ఎత్తున తరలిరావటంతో కోలాహలం నెలకొంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి కార్ల రద్దీతో కిటకిటలాడింది. గత రెండు రోజుల నుంచీ ఉదయం నుంచి రాత్రి వరకూ ఈ ఉధృతి కొనసాగింది. హైదరాబాద్‌ నుంచి భారీ సంఖ్యలో వస్తున్న వారు విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) చేరుకుంటున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లే బస్సులన్నింటినీ హైదరాబాద్‌కు పెద్ద సంఖ్యలో పంపి అక్కడి నుంచి ప్రజలను తీసుకు వచ్చే పని చేపట్టారు. అయితే వీరంతా విజయవాడ వచ్చే సరికి ఇక్కడ చాలినన్ని బస్సులు లేవు. విజయవాడ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లటానికి బస్సులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ నుంచి కాకినాడ, రావులపాలెం, అమలాపురం, రాజమండ్రి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లటానికి బస్సులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీఎన్‌బీఎస్‌ ఆర్టీసీ అధికారులతో గొడవకు దిగారు. తామేమీ చేయడలేమని వారు చేతులెత్తేశారు. గత్యంతరం లేక ప్రయాణికులు విజయవాడ నుంచి కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లను అధిక కిరాయికి మాట్లాడుకుని వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు ఆర్టీసీ అధికారులు ఏకంగా 5,458 బస్సులను ఎన్నికల సంఘానికి అద్దెకు ఇచ్చారు. షెడ్యూలు కంటే 55 శాతం బస్సుల అదనంగా కేటాయించి ఆదివారం ఉదయం నుంచే బస్సులను ఆయా డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రాలకు పంపడంతో ప్రయాణికులకు బస్సులకొరత ఏర్పడింది.

నూరు శాతం ఆక్యుపెన్సీతో విమానాలు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నైల నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాణికులు తరలివచ్చారు. రైళ్లన్నీ కిటకిటలాడాయి. సీట్లు లేకపోవటంతో రిజర్వేషన్‌ బోగీల్లోకి చొరబడి రావాల్సి వచ్చింది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమానాలు నూరు శాతం ఆక్యుపెన్సీతో వచ్చాయి. కార్లలో పెద్ద ఎత్తున తరలిరావటంతో ఆంధ్రా చెక్‌పోస్టు, టోల్‌ప్లాజాల వద్ద ఖాళీలేనంతగా వాహనాలు ముందుకు సాగాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండు వందలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. రద్దీకి తగిన బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చిన అరకొర బస్సులూఖాళీ లేకపోవడంతో టాప్‌పైన, ఫుట్‌బోర్డుపై వేలాడుతూనే ప్రయాణించారు. ఏలూరు జిల్లాలో ఓటేసేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వస్తున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండుటెండలో బస్సుల కోసం గంటలతరబడి నిరీక్షించారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోల పరిధిలోని బస్సులంటినీ తరలించడంతో రెగ్యులర్‌ సర్వీసులు తగ్గిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఎన్నికలకు 5,458 ఆర్టీసీ బస్సులు

షెడ్యూలు కంటే 55 శాతం అదనం

విజయవాడ (బస్‌స్టేషన్‌), మే 12: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది, ఈవీఎంల వంటి సామగ్రి రవాణా కోసం 5458 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూలు కంటే సుమారు 55 శాతం అదనంగా బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఓటు వేసేందుకు ఏపీకి వచ్చే వారి కోసం ఆదివారం వరకు 1066 బస్సులు, బెంగుళూరు నుంచి 284 బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎక్కడైనా సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఒకే గమ్యానికి చేరుకోవాలంటే ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలోని ఎలక్షన్‌ సెల్‌ 9959111281 నంబరులో సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - May 13 , 2024 | 05:23 AM

Advertising
Advertising