ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీడీపీకి నీటి విడుదల

ABN, Publish Date - Nov 29 , 2024 | 12:10 AM

గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా(హెచఎనఎస్‌) నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రోజుకు 60 క్యూసెక్కుల ప్రకారం హంద్రీనీవా నుంచి జీడీపీకి చేరుతుంది.

గాజులదిన్నె ప్రాజెక్టుకు ప్రవహిస్తున్న హంద్రీనీవా జలాలు

హంద్రీనీవా నుంచి రోజుకు 60 క్యూసెక్కులు

తాగు,సాగు నీటికి ఇక్కట్లు తీరినట్లే

15 వేల ఎకరాల సాగుకు సిద్ధ్దమైన రైతులు

గోనెగండ్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టుకు హంద్రీనీవా(హెచఎనఎస్‌) నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రోజుకు 60 క్యూసెక్కుల ప్రకారం హంద్రీనీవా నుంచి జీడీపీకి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు, తాగునీటి పథకాలకు ప్రస్తుతం పరస్థితులలో గాని వచ్చే వేసవిలో గాని తాగునీటి కష్టాలు తీరినట్లే. ప్రసుత్తం ప్రాజెక్టులో 2.2 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఐఏబీ సమావేశంలో నీటి విడుదలకు గ్రీన సిగ్నల్‌ రావడంతో అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. జీడీపీ కింద 15వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేయాల్సిఉంది. అందుకు గాను రైతులు కూడా తమ భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు. నీటి విడుదలైన వెంటనే విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు రోజుల్లో నీటి విడుదలకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆయకట్టు రైతులు సైతం నీటి విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నీటి విడుదలకు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఏడాది 15 వేల ఎకరాలు సాగు కానుంది. ప్రాజెక్టు కింద బండగ ట్టు, డోన, క్రిష్ణగిరి, కోడుమూరు, గూడూరు, కర్నూలు, బెళగల్‌ తదితర ప్రాంతాల తాగునీటి పథకాలకు కూడా నీరు విడుదల కావాల్సిఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2.2 టీఎంసీకి హంద్రీనీవా నీరు తోడు కావడతో ఇక తాగునీటి పథకాలకు, సాగునీటికి ఇబ్బంది ఉండదు. శ్రీశైలం బ్యాంక్‌ వాటర్‌ తగ్గే వరకు హంద్రీనీవా నుంచి నీటి విడుదల కొనసాగుతుంది.

Updated Date - Nov 29 , 2024 | 12:10 AM