ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అస్ఫియా కుటుంబాన్ని ఆదుకుంటాం

ABN, Publish Date - Oct 06 , 2024 | 11:58 PM

పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి అస్ఫియా కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విఽధాలుగా ఆదుకుంటుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు పేర్కొన్నారు.

రాష్ట్ర మంత్రులను కలసిన ఎమ్మెల్యే షాజహానబాషా, జగనమోహనరాజు, శ్రీరామ్‌చినబాబు

మదనపల్లె టౌన, అక్టోబరు 6: పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి అస్ఫియా కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విఽధాలుగా ఆదుకుంటుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు పేర్కొన్నారు. ఆది వారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు వచ్చిన రాష్ట్ర మంత్రులు అనిత, ఫరూఖ్‌, రామ్‌ప్రసాదరెడ్డి, మదనప ల్లె ఎమ్మెల్యే షాజహానబాషా, టీడీపీ పార్లమెంటు అధ్య క్షుడు జగనమోహనరాజులతో కలసి అస్ఫియా కుటుం బాన్ని చినబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్ఫియా హత్య కేసును పోలీసు లు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారని, అంతలోపే మాజీమంత్రి పెద్దిరెడ్డి శవరాజకీయా లు చేస్తూ, జగనను పుంగనూరుకు రప్పిస్తున్నారని విమ ర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ విషయమై వైసీపీ పెద్దలు ఇరుకునపడే స్థితిలో ఉండగా ఈ కేసులన్నింటిపై ప్రజల ను తప్పుదోవ పట్టించేందుకు అస్ఫియా హత్యపై రాజకీ యాలు చేస్తూ బూటకపు పరామర్శలు చేస్తున్నారని చిన బాబు విమర్శించారు.

Updated Date - Oct 06 , 2024 | 11:58 PM