ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అన్నదాతకు చల్లని కబురు!

ABN, Publish Date - May 16 , 2024 | 03:37 AM

అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం

విశాఖపట్నం, మే 15(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షా లు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. 50ఏళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాల సీజన్‌లో సగటున 87 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 03:37 AM

Advertising
Advertising