ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలకు రక్షణగా అభయ మహిళా సేఫ్టీ బృందాలు

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:40 AM

ఏలూరు జిల్లాలో మహిళలకు అండగా పోలీస్‌ శాఖ మరో ముందుగు వేసింది. ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభయ మహిళా సేఫ్టీ లోగోను ఆవిష్కరించి బృందాలను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాపశివకిశోర్‌, జేసీ పి.ధాత్రిరెడ్డి బుధవారం ప్రారంభించారు.

నేరాల నివారణకు మహిళా సిబ్బంది పాటు పడాలి : ఐజీ

ఏలూరు క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు జిల్లాలో మహిళలకు అండగా పోలీస్‌ శాఖ మరో ముందుగు వేసింది. ఏలూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభయ మహిళా సేఫ్టీ లోగోను ఆవిష్కరించి బృందాలను ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాపశివకిశోర్‌, జేసీ పి.ధాత్రిరెడ్డి బుధవారం ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో అభయ మహిళా సేఫ్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్పీని అభినందించారు. పోలీసు వ్యవస్థలో 30 శాతం మహిళా పోలీస్‌ సిబ్బంది పని చేస్తున్నారని, భవిష్యత్తులో జరిగే రిక్రూట్‌మెంట్‌ లోను 30 శాతం మహిళలను నియమించనున్నట్టు ప్రకటించారు. మహిళా సేఫ్టీలో మహిళా పోలీసులు, గ్రామ మహిళల సంరక్షణ కార్యదర్శులు కాలేజీలు, హాస్టల్స్‌, బస్టాండ్‌ల వద్ద ఆకతాయిలు వేధింపులకు గురి చేసే ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు పాటుపడాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎవరైనా మహిళలు, యువతులు, బాలికలను వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత, సేఫ్టీ ఈ అభయ యాప్‌ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 95503 51100 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని లేదా టోల్‌ఫ్రీ నంబరు 112కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. జేసీ మాట్లా డుతూ ఈ అభయ యాప్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యకరమంలో ఏఎస్పీ సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, ఏఆర్‌ ఆర్‌ఐ పవన్‌కు మార్‌, ఏలూరు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, టూటౌన్‌ సీఐ రమణ, త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ సుబ్బారావు, కైకలూరు రూరల్‌ ఎస్‌ఐ రవికుమార్‌, ఎస్‌బి సీఐ మల్లేశ్వరరావు, మహిళా ఎస్‌ఐ కాంతిప్రియ, మౌనిక, నాగకల్యాణి, పోలీస్‌ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:40 AM