ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ABN, Publish Date - Apr 06 , 2024 | 11:57 PM

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఏపీ నిట్‌ డీన్‌ అకడమిక్‌ డాక్టర్‌ టి.కురుమయ్య అన్నారు.

ఏపీ నిట్‌లో విద్యార్థులతో ఆచార్యులు

తాడేపల్లిగూడెం అర్బన్‌, ఏప్రిల్‌ 6:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఏపీ నిట్‌ డీన్‌ అకడమిక్‌ డాక్టర్‌ టి.కురుమయ్య అన్నారు. ఏపీ నిట్‌లో వార్షిక క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కిరణ్‌తీపర్తి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ మనసు పెట్టి సాధన చేస్తే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చన్నారు. నూతన విద్యా విధానంలో పరిఽశోధనలకు అత్యం త ప్రాధాన్యత ఇచ్చారని వైవిధ్య భరితమైన ఆలోచనలతో ముందుకు వచ్చే విద్యార్థులను సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. డీన్‌లు డాక్టర్‌ జీబీ.వీరేష్‌కుమార్‌, డాక్టర్‌ కార్తీక్‌ శేషాద్రి మాట్లాడుతూ క్రీడల్లో రాణించడం వల్ల ఖ్యాతి గడించడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు పథకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆచా ర్యులు డాక్టర్‌ నరసింహ, డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ పి. కిషోర్‌, డాక్టర్‌ తలారి రేష్మ, సాస్‌ అసిస్టెంట్స్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సాయిరాం, సంధ్యారాణి పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:57 PM

Advertising
Advertising